ప్రైవేటు టీచర్లకు నెలకు 2 వేలు, 25 కిలోల బియ్యం – సీఎం కేసీఆర్

తెలంగాణలో ప్రైవేట్‌ టీచర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతపడటంతో ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రతినెలా రూ.2వేల నగదు సాయంతో పాటు కుటుంబానికి 25 కిలోల బియ్యం ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షా 45వేల మందికి లబ్దిచేకూరనుంది.

గుర్తింపు పొందిన ప్రయివేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి నెలకు రూ. 2 వేల ఆర్ధిక సాయంతో పాటు కుటుంబానికి 25 కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.

ఇందుకు సంబంధించి ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది తమ బ్యాంకు అకౌంటు, వివరాలతో స్థానిక జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుందని సీఎం తెలిపారు. ఇందుకు గాను, విద్యాశాఖ అధికారుల సమన్వయం చేసుకుంటూ విధివిధానాలను ఖరారు చేయాల్సిందిగా ఆర్ధిక శాఖ కార్యదర్శి శ్రీ రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 1 లక్షా 45 వేల మంది ఉపాధ్యాయులు ఇతర సిబ్బందికి లబ్ధిచేకూరుతుంది.

Follow Us@