ప్రైవేటు స్కూల్స్ ట్యూషన్ పీజు మాత్రమే వసూలు చేయాలంటూ ఉత్తర్వులు జారీ

కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ప్రైవేట్‌ స్కూళ్లు 2021-22 విద్యా సంవత్సరానికి ఫీజులను ఇష్టం వచ్చిన రీతిలో పెంచవద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

తెలంగాణ రాష్ట్ర పరిధిలోని స్కూళ్లతో పాటు, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ సహా ఇతర ఇంటర్నేషనల్‌ బోర్డుల నుంచి గుర్తింపు పొందిన స్కూళ్లన్నీ ఆదేశాలను పాటించాలని పేర్కొన్నది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా సోమవారం జీవో 75 జారీచేశారు. గత ఏడాది జారీ చేసిన జీవో 46 ప్రకారమే స్కూళ్లు నడుచుకోవాలని జీవోలో పేర్కొన్నారు.

అదీకాక ట్యూషన్‌ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని, అది నెలవారీగా మాత్రమే తీసుకోవాలని స్పష్టంచేశారు. నిబంధనలను పాటించని విద్యాసంస్థల గుర్తింపును రద్దుచేస్తామని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జీవో అమలుకు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు.

Follow Us @