జూలై 23న జే.ఎల్. టూ ప్రిన్సిపాల్ పదోన్నతికి కౌన్సెలింగ్

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వివిధ కారణాల వల్ల ఏర్పడిన ప్రిన్సిపాల్ పోస్టుల ఖాళీలను జూనియర్ లెక్చరర్లకు ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా భర్తీ చేయడానికి ఇంటర్మీడియట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5, 6 వ జోన్లు మరియు సిటీ కేడర్ లలో ఖాళీగా ఉన్న 5 ప్రిన్సిపాల్ పోస్టులను ప్రమోషన్ ద్వారా నింపడానికి ఉత్తర్వులు జారీ చేసింది.

ఇందుకు సంబంధించిన కౌన్సెలింగ్ జూలై 23వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు.