త్వరలో ‘ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కు’ రెండేళ్ల డిప్లొమా కోర్స్

న్యూడిల్లీ (ఫిబ్రవరి – 22) :దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు నూతన విద్యా విధానం 2020 తమ పరిధిలో ప్రీ స్కూల్ విద్యార్థులకు తగిన విధంగా బోధించే టీచర్లను తయారుచేయడానికి వీలుగా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ లో రెండేళ్ల డిప్లొమా కోర్సును రూపొందించి అమలుచేయాలని కేంద్ర విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఈ కోర్సును స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (SCERT) ద్వారా రూపొందించి, డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ల (డైట్) ద్వారా అమల్లో పెట్టాలి. ఈ కార్యక్రమాన్ని ఎస్సీఈఆర్టీ పర్యవేక్షణలో నిర్వహించాలి” అని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలకు సూచించింది.

ఇప్పటికే ప్రైమరీ స్కూల్స్ కు DEET, హైస్కూలకు B.Ed కోర్సులు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.