హైదరాబాద్ (ఆగస్టు 21) : ప్రీ, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం మైన్స్, సినీ, బీడీ కార్మికుల పిల్లలు దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర సంక్షేమ శాఖ తెలిపింది. ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ కోసం ఒకటో తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు సెప్టెంబర్ 30లోపు దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టు మెట్రిక్ కోసం 11వ తరగతి ఆపై చదువుతున్నవారు అక్టోబర్ 31 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అసిస్టెంట్ వెల్ఫేర్ కమిషనర్ అభినవ్ తివారీ గురువారం ఒ ప్రకటనలో సూచించారు.
వెబ్సైట్ : https://scholarships.gov.in
వివరాలకు helpdesk@nsp.gov.in,
0120-6619540, 040-24658026 సంప్రదించాలని కోరారు.