గిరిజన గురుకుల ఉద్యోగులకు పీఆర్సీ అమలు

తెలంగాణ గిరిజన రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ లో పనిచేస్తున్న టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగులకు నూతన పిఆర్సి 2020 అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఉత్తర్వుల ప్రకారం…

మానిటరీ బెనిఫిట్ ఏప్రిల్ 1 2020 నుండి అమలవుతుంది.

నూతన పి ఆర్ సి ప్రకారం వేతనాలను జూన్ 2021 నుండి చెల్లించడం జరుగుతుంది.

ఏప్రిల్ 1 2020 నుండి మార్చి 31 2021 వరకు ఏరియర్స్ ను పదవి విరమణ తర్వాత చెల్లిస్తారు.

2021 ఏప్రిల్, మే నెలల ఏరియర్స్ చెల్లింపుకు ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేయటం జరుగుతుంది.

Follow Us @