పారాలంపిక్స్ – షట్లర్ ప్రమోద్ భగత్ కి స్వర్ణం

టోక్యో పారాలింపిక్స్‌లో బ్యాడ్మింట‌న్ మెన్స్ సింగిల్స్ ఫైన‌ల్ మ్యాచ్‌లో ష‌ట్ల‌ర్ ప్ర‌మోద్ భ‌గ‌త్ ఘ‌న విజ‌యం సాధించాడు. గ్రేట్ బ్రిట‌న్‌కు చెందిన డేనియ‌ల్ బెతెల్‌ను 21-14, 21-17 తేడాతో రెండు వ‌రుస సెట్ల‌లో ఓడించి ప‌సిడి ప‌త‌కాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు.

మరోవైపు బ్యాడ్మింట‌న్ మెన్స్ సింగిల్స్ ఫైన‌ల్ మ్యాచ్‌లో ష‌ట్ల‌ర్ మనోజ్ సర్కార్ కాంస్య పతకం గెలుచుకున్నాడు

దీనితో ఈ పారాలింపిక్స్‌లో భార‌త క్రీడాకారులు సాధించిన స్వ‌ర్ణ ప‌త‌కాల సంఖ్య నాలుగుకు చేరింది. మొత్తం ప‌త‌కాల సంఖ్య 17కు చేరింది.

Follow Us @