ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో 3,897 పోస్టుల భర్తీకి అనుమతి

హైదరాబాద్ (డిసెంబర్ – 01) : ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో 3,897 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. వివిధ కేటగిరీల్లో తొమ్మిది వైద్య కళాశాలలు, అనుబంధ హాస్పిటళ్లకు పోస్టులను మంజూరు చేసింది. ఈ మేరకు ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు జారీచేసింది.

రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, జనగామ, నిర్మల్‌లోని మెడికల్‌ కాలేజీలు, వాటికి అనుబంధంగా ఉన్న హాస్పిటళ్లకు ఈ పోస్టులను మంజూరు చేసింది. వీటిలో ఒక్కో కాలేజీకి 433 పోస్టులను కేటాయించింది.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @