పీఈటీ,‌ భాషా పండితులకు ఉద్యోగోన్నతి

తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలోని పీఈటీ, భాషా పండితులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీఈటీ, భాషా పండితుల పోస్టులను స్కూల్‌ అసిస్టెంట్‌గా అప్‌గ్రేడ్‌ చేస్తూ విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో రాష్ట్రంలోని 8,630 మంది భాషా పండితులు, 1,849 మంది పీఈటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి లభించనుంది. ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

Follow Us@