POSTAL JOBS – పదో తరగతితో 44,288 ఉద్యోగాలు

BIKKI NEWS : POSTAL JOBS NOTIFICATION 2024 WITH 44288 JOBS. భారత తపాల శాఖ దేశ వ్యాప్తంగా తన బ్రాంచ్ లలో 44,288 పోస్టుల భర్తీ కోసం 2024 జూన్ సెషన్ కు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. పదో తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎలాంటి రాత పరీక్ష లేకుండా, పదో తరగతిలో వచ్చిన మార్కులు మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు.

POSTAL JOBS NOTIFICATION 2024 WITH 44288 JOBS

మొత్తం ఖాళీలు : 44,288 కలవు. తెలంగాణ రాష్ట్రం లో 981, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1355 పోస్టులు కలవు.

పోస్టుల వివరాలు :

  • బ్రాంచ్ పోస్ట్ మాస్టర్
  • అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్
  • డాక్ సేవక్

అర్హతలు : పదో తరగతి ఉత్తీర్ణత

దరఖాస్తు విధానం : ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తు చేసుకోగలరు

దరఖాస్తు గడువు : జూలై 15 నుండి ఆగస్టు 05 – 2024 వరకు

దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ : ఆగస్టు 6 – 8 తేదీలలో

ఎంపిక విధానం : పదవ తరగతిలో సాధించిన మార్కులు మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వయోపరిమితి : 18 – 40 సంవత్సరాల మద్య వయస్సు కలిగి ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు.)

వేతనం :

  • BPM : 12,000 – 29,380/-
  • APM/DS : 10,000 – 24,470/-

పూర్తి నోటిఫికేషన్ : Pdf download

వెబ్సైట్ : https://indiapostgdsonline.gov.in/

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు