POSTAL JOBS – పదో తరగతి మార్కులతో పోస్టల్ ఉద్యోగాలు

BIKKI NEWS (MARCH 12) : ఇండియన్ పోస్ట్ దేశవ్యాప్తంగా ఉన్న సర్కిలలో భారీగా ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ సిద్ధం చేసింది. దాదాపు 50 వేల గ్రామీణ్ డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి (POSTAL GRAMIN DAK SEVAK JOBS 2024) ప్రకటన త్వరలో వెలువడనుంది.

ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కులు మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వంటి పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.

వయోపరిమితి 18 నుండి 40 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ఆధారంగా వయస్సు సడలింపు కలదు.

వేతనం ప్రారంభంలో 1౦వేల నుండి 12 వేల మధ్య ఉంటుంది. పదోన్నతులు ద్వారా ఉన్నత స్థానాలకు చేరవచ్చు.

ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంకు సర్వీసులు ద్వారా ఇన్సెంటివ్ పొందవచ్చు. గతేడాది ఈ పోస్టుల భర్తీ కోసం 40,889 ఖాళీలను భర్తీ చేశారు. ఈ ఏడాది 50 వేలకు పైచీలుకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం.

వెబ్సైట్ : https://indiapostgdsonline.gov.in/