Home > JOBS > POSTAL JOBS > POSTAL JOBS MERIT LIST – 12,828 ఉద్యోగాల మెరిట్ లిస్ట్

POSTAL JOBS MERIT LIST – 12,828 ఉద్యోగాల మెరిట్ లిస్ట్

BIKKI NEWS (JAN. 14) : POSTAL GDS JOBS 9th MERIT LIST – పోస్ట్ ఆఫీస్ లలో 12, 828 గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుల 9 వ మెరిట్ జాబితాను పోస్టల్ శాఖ విడుదల చేసింది. ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు జనవరి 24 లోగా సంబంధిత తపాలా కార్యాలయాల్లో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని సూచించింది.

దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో 12,828 గ్రామీణ డాక్ సేవక్ .(స్పెషల్ డ్రైవ్) ఉద్యోగాల భర్తీకి తపాలా శాఖ గతేడాది మే నెలలో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల తొమ్మిదో జాబితాను తపాలా శాఖ విడుదల చేసింది.

మొత్తం ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ 118 పోస్టులు ఉండగా, తెలంగాణలో 96 చొప్పున ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ గి సేవలు అందించాల్సి ఉంటుంది. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కులు లేదా గ్రేడ్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేపట్టారు. కంప్యూటర్ జనరేటర్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశారు.

AP GDS JOBS MERIT LIST

TS GDS JOBS MERIT LIST