పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

2021 – 22 విద్యా సంవత్సరానికి గాను పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలకు విద్యార్థులు మరియు విద్యా సంస్థలు దరఖాస్తుల ప్రక్రియ నేటితో ప్రారంభం కానుంది.

ఇంటర్మీడియట్ ఆపై తరగతులు చదివే విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల కొరకు ఈ పాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయడానికి సెప్టెంబర్ – 24 నుంచి ప్రారంభమై అక్టోబర్ – 24 వరకు గడువు కలదు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, దివ్యాంగులు నూతనంగా మరియు రెన్యూవల్ ఉపకార వేతనాల కొరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

వెబ్సైట్ :: https://telanganaepass.cgg.gov.in/