తెలంగాణ రాష్ట్రం లోని విద్యార్థులకు అందించే స్కాలర్షిప్ (ఉపకార వేతనాలు), ఫీజు రీయింబర్స్మెంట్ ల(బోధనా రుసుముల) దరఖాస్తు గడువు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ-పాస్ ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 31 వరకు గడువు పొడిగించింది. 2020-21 విద్యాసంవత్సరానికి గాను గతేడాది 14 అక్టోబర్ నుంచి ఇవాళ్టి వరకు ప్రభుత్వం ఈ-పాస్ వెబ్సైట్ను అందుబాటులో ఉంచింది.
స్కాలర్షిప్లు, రెన్యూవల్ కోసం దాదాపు 5 లక్షల 11 వేల మంది దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ఇంకా చాలామంది చేసుకోలేదు.
కొవిడ్ నేపథ్యంలో విద్యా సంవత్సరం ఆలస్యమైనందున వివిధ కోర్సుల్లో ప్రవేశాలు ఇంకా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ఈ-పాస్ వెబ్సైట్ను మార్చి 31 వరకు అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
అన్ని సంక్షేమశాఖల అధికారులు కళాశాల యాజమాన్యాలకు, విద్యార్థులకు ఈ విషయం తెలియజేసి గడువులోగా దరఖాస్తులు పూర్తయ్యేలా చూడాలని సూచించాయి.
Follow Us@