ఉపకార వేతనాల గడువు పెంపు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తుకు గడువు తేదీని మే 31 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. ఈ నేపథ్యంలో ఇంటర్, డిగ్రీ ఆపై తరగతులు చదువుతున్న విద్యార్థులు స్కాలర్షిప్ కొరకు మీసేవా ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ సంక్షేమ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.

తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని కోర్సుల్లో ప్రవేశాలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు

కావున ఇంటర్, డిగ్రీ, తత్సమాన తరగతులు, ఆపై తరగతులు చదువుతున్న విద్యార్థులు మే 31 2021 లోపు మీ సేవ ద్వారా ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలి

Follow Us@