మార్చి 31 తో ముగుస్తున్న స్కాలర్ షిప్ దరఖాస్తు గడువు

పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 31తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఇంటర్, డిగ్రీ ఆపై తరగతులు చదువుతున్న విద్యార్థులు స్కాలర్షిప్ కొరకు మీసేవా ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ సంక్షేమ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.

ఇప్పటికే గడువును పలుమార్లు పెంచిన నేపథ్యంలో మరొక్కసారి దరఖాస్తు చేయడానికి గడువు పెంచే అవకాశం తక్కువని అధికార వర్గాలు తెలిపాయి.

కావున ఇంటర్, డిగ్రీ ఆపై తరగతులు చదువుతున్న విద్యార్థులు మార్చి 31 2021 లోపు మీ సేవ ద్వారా ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలి.

Follow Us@