స్కాలర్ షిప్స్ గడువు పెంపు

తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ లకు దరఖాస్తు గడువును తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 15 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఉపకార వేతనాల దరఖాస్తు గడువు డిసెంబర్ 31తో ముగిసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కనీసం సగం మంది విద్యార్థులు కూడా ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇంటర్ లేదా తత్సమాన మరియు ఆపై విద్యలను అభ్యసిస్తున్న విద్యార్థులు ఈ ఉపకార వేతనాల కు అర్హులు.

ఎస్సీ, ఎస్టీ, బిసి, ఈబిసి, మైనారిటీ, శారీరక వైకల్యం గల విద్యార్థులు కింద వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

వెబ్సైట్::

https://telanganaepass.cgg.gov.in/

Follow Us@