APPSC JOBS : పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగ నోటిఫికేషన్

విజయవాడ (ఎప్రిల్‌ – 21) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ విభాగాలలో 21 పాలిటెక్నిక్ లెక్చరర్ల (POLYTECHNIC LECTURER JOBS) పోస్టుల భర్తీకి దివ్యాంగుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

◆ పోస్టుల వివరాలు : మొత్తం పోస్టులు : 21

ఆటోమొబైల్ ఇంజనీరింగ్ : 02
కమర్షియల్ & కంప్యూటర్ ప్రాక్టీసు : 01
కెమికల్ ఇంజనీరింగ్ : 01
సివిల్ ఇంజనీరింగ్ : 05
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ : 01
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ : 04
ఇంగ్లీషు : 03
మ్యాథ్స్ : 01
మెకానికల్ ఇంజనీరింగ్ : 02
మైనింగ్ ఇంజనీరింగ్ : 01

◆ అర్హతలు : సంబంధిత విభాగంలో బిఈ, బిటెక్, పీజీ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి. దివ్యాంగులై ఉండాలి.

◆ ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ, ధృవపత్రాల పరిశీలన ఆధారంగా

◆ దరఖాస్తు గడువు : ఎప్రిల్‌ – 27 నుంచి మే – 17 – 2023 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

◆ వెబ్సైట్ : APPSC WEBSITE