పాలిటెక్నిక్ కాంట్రాక్టు అధ్యాపకుల రెన్యూవల్ ఉత్తర్వులు విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న 578 కాంట్రాక్టు లెక్చరర్ లను మరియు 294 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను 2021 – 22 విద్యా సంవత్సరానికిగాను కోనసాగిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు (G.O. Rt. No. 1148) జారీ చేసింది.

వీరి సర్వీస్ ను జూన్ 01 – 2021 నుండి మే 31 – 2022 వరకు కొనసాగించాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

★ నూతన కళాశాలలో కాంట్రాక్టు పద్దతిలో నియామకాలు

అలాగే నూతనంగా ఏర్పడిన 11 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 135 అధ్యాపక పోస్టులను, 77 వర్క్ షాప్ అటెండెంట్ సర్వీస్ పోస్టులను కాంట్రాక్టు పద్దతిలో ఈ విద్యా సంవత్సరానికి నియమించుకోవాలని సాంకేతిక విద్యా శాఖకు అనుమతిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం తమ సర్వీస్ ను రెన్యూవల్ చేయడం పట్ల పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ యూనియన్ (TGPLA – C) అధ్యక్షుడు జి. ఉమా శంకర్, ప్రధాన కార్యదర్శి అస్మతుల్లా ఖాన్, వర్కింగ్ ప్రెసిడెంట్ పి. అరుణ్ ఇమ్మాన్యుయోల్ హర్షం వ్యక్తం చేశారు.

RENEWAL GO COPY 2021 – 22

Follow Us @