పాలిటెక్నిక్ కాంట్రాక్టు లెక్చరర్ ల జూన్, జూలై వేతనాలకై మెమో జారీ పై – TGPLA-C హర్షం

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ (578) ఔట్ సోర్సింగ్ (287) మంది ఉద్యోగులకు 2021 – 22 విద్యా సంవత్సరానికి సంబంధించిన జూన్‌, జూలై నెలల వేతనాల చెల్లింపు కోసం సర్క్యురల్ మెమో ను టెక్నికల్ ఎడ్యుకేషన్ కమీషనర్ జారీ చేశారు.

2021 – 22 విద్యా సంవత్సరంలో వీరంతా విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో జూన్, జూలై నెల వేతనాలను చెల్లించుటకు కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారు ఒక సర్కులర్ మెమో ను విడుదల చేయడం జరిగింది దీని పట్ల పాలిటెక్నిక్ కాంట్రాక్టర్ లెక్చరర్ ల అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది.

గత ఏడాది రెన్యువల్ జిఓ ఆధారంగా ఈ ఏడాది నూతన విద్యా సంవత్సరం 2021 – 22 జూన్, జూలై మాసాల్లో వేతనాలకు సంబంధించి ఏ ఇబ్బంది లేకుండా కమిషనర్ మెమో విడుదల చేయడం పట్ల ఉమాశంకర్, అస్మతుల్లా ఖాన్, అరుణ్ ఇమాన్యుయోల్ కమీషనర్ కు కృతజ్ఞతలు తెలిపారు