నేడే పాలిసెట్ – 2021 పరీక్ష

తెలంగాణ పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (POLYCET-2021). రాష్ట్రవ్యాప్తంగా 411 కేంద్రాల్లో ఆఫ్‌ లైన్‌ పద్ధతిలో ఈ పరీక్షను ఈ రోజు నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేశామని సాంకేతిక విద్య కమిషనర్ నవీన్‌ మిట్టల్‌ ప్రకటించారు.

కరోనా పాజిటివ్ ఉన్న అభ్యర్థులకు హస్పిటల్ లోనే పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. అందువల్ల కరోనా పాజిటివ్‌ అభ్యర్థులు సమాచారం ఇవ్వాలని సూచించారు.

పాలిసెట్‌ పరీక్షను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించనున్నారు. గంట ముందునుంచే పరీక్ష హాలు‌లోకి అను‌మ‌తి‌స్తా‌మని, 11 గంటల తర్వాత ఎట్టి‌ప‌రి‌స్థి‌తు‌ల్లోనూ అను‌మ‌తిం‌చ‌బో‌మని స్పష్టం చేశారు.

  • బాసర ఆర్జీయూకేటీకి ప్రత్యేక మెరిట్‌ జాబితాలు పంపిస్తామని చెప్పారు.
  • వ్యవసాయ, పశువైద్య కోర్సులకు ప్రత్యేక మెరిట్‌ జాబితాలు రూపొందిస్తామన్నారు.
  • సెప్టెంబర్‌ 1 నుంచి పాలిటెక్నిక్‌ తరగతులు ప్రారంభిస్తామన్నారు.