POLICE JOBS : సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు నేడే ఆఖరు

హైదరాబాద్ (జూన్ 26) : తెలంగాణ రాష్ట్రంలో పోలీసు అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ గడువు నేటితో ముగియనున్నది.

TSPLRB జూన్ 14 నుంచి 26 వరకు అర్హులైన 1,09,906 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తికి ఏర్పాట్లు చేసింది. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా 18 కేంద్రాలను కేటాయించింది.

సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కేంద్రంలోనే దరఖాస్తు సవరణకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు TSPLRB తెలిపింది.