మోడల్ స్కూల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్సీ అమలు పట్ల హర్షం – PMTA – TS

తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూల్ లలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అయిన ఫిజికల్ డైరెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఆఫీస్ సబార్డినేట్ లు, నైట్ వాచ్మెన్ లకు నూతన పి ఆర్ సి ప్రకారం నేతన పెంపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ కావడం పట్ల PMTA TS రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీష్ ధన్యవాదాలు తెలియజేశారు.

ఫిజికల్ డైరెక్టర్లుకు 22,750, కంప్యూటర్ ఆపరేటర్లు 19,500, ఆఫీస్ సబార్డినేట్ లు, నైట్ వాచ్మెన్ లకు 15,600 చొప్పున నూతన వేతనాలు అందనున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రోగ్రెసివ్ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (PMTA TS) సంఘం తరుపున ముఖ్య మంత్రి కేసీఆర్ కు ,విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికు, మోడల్ స్కూల్ అదనపు సంచాలకులు ఉషారాణి లకు రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీష్ ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది.