PM YASASVI : నేడు ముగుస్తున్న 1.25 లక్షల స్కాలర్షిప్ గడువు

హైదరాబాద్ (ఆగస్టు- 10) : PM YASASVI SCHOLARSHIP 2023 కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధానమంత్రి యంగ్ అచీవర్స్ స్కాలర్‌షిప్ అవార్డు స్కీమ్ పర్ వైబ్రెంట్ ఇండియా స్కీమ్ కింద దేశ వ్యాప్తంగా 9వ తరగతి, 11వ తరగతి చదువుతున్న 30 వేల మంది విద్యార్థులకు ప్రవేశ పరీక్ష (PM YET 2023) నిర్వహించి స్కాలర్షిప్ అందజేయనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి గడువు నేటితో ముగియనుంది.

అర్హతలు ప్రస్తుతం 9వ తరగతి, 11వ తరగతి (ఇంటర్ ఫస్టీయర్) చదువుతూ ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 2.5 లక్షలు మించరాదు.

స్కాలర్షిప్ విలువ : 9, 10 వ తరగతి లో 75 వేలు,. 11, 12 తరగతులలో 1,25,000 చొప్పున అందజేస్తారు. ప్రవేశ పరీక్షను తేదీ సెప్టెంబర్ – 29 – 2023 న నిర్వహించనున్నారు.

ఎంపిక విధానం : యశస్వి ప్రవేశ పరీక్షలో (PM YET 2023) ప్రతిభ ఆధారంగా

◆ వెబ్సైట్ : https://yet.nta.ac.in/