PM MODI AWARDS : నరేంద్ర మోదీని వరించిన పలు అవార్డులు

BIKKI NEWS : PM NARENDRA MODI RECEIVED AWARDS. ని పలు దేశాలు, అంతర్జాతీయ సంస్థలు తమ అత్యున్నత పురష్కారాలతో సత్కరించాయి. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రిగా గడచిన తొమ్మిదేళ్ల కాలంలో మోదీకి వచ్చిన అవార్డులను ఓసారి చూద్దాం… PM NARENDRA MODI RECEIVING INTERNATIONAL AWARDS LIST.

PM NARENDRA MODI RECEIVED AWARDS

వివిధ దేశాలు అందజేసిన పురష్కారాలు

ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్సీ

గయానా దేశపు అత్యున్నత పురష్కారం

ది గ్రాండ్‌ కమాండర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది నైగర్‌’

నైజీరియా దేశపు రెండో అత్యున్నత జాతీయ పురష్కారం.

ది డొమెనికా అవార్డు ఆఫ్ హనర్

డొమెనికా దేశపు అత్యున్నత పౌర పురష్కారం.

గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ హానర్ అవార్డు

గ్రీస్ దేశపు అత్యున్నత పురష్కారం. ఆ దేశ అధ్యక్షుడు కేటరీనా యన్ సకెల్లాపురో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కి అందజేశారు ్

గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లెజెండ్ ఆఫ్ హనర్ :

ప్రాన్స్ దేశపు అత్యున్నత పౌర సైనిక పురష్కారం. ప్రాన్స్ దెశ పర్యటన నేపథ్యంలో ఆ దెశ అధ్యక్షుడు మక్రాన్ నరేంద్ర మోదీ కి అందజేశారు.

ఆర్డర్ ఆఫ్ ద నైల్:

ఈజిప్టు అత్యున్నత పురస్కారమిది. తమ దేశ పర్యటనలో భాగంగా నరేంద్ర మోదీకి ఆ దేశ అధ్యక్షుడు అబ్ధుల్ ఫతా ఎల్-సిసి అందజేసి సత్కరించారు. తమ దేశంలో సహా మానవాళికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా దేశాధినేతలు, ప్రముఖులకు ఈ అవార్డును ఈజిప్టు అందజేస్తోంది.

కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లొగోహు:

పపువా న్యూ గినియా అత్యున్నత పురస్కారం. పసిఫిక్ ద్వీప దేశాల ఐక్యతతో పాటు ‘గ్లోబల్ సౌత్ ప్రయోజనాల కోసం చేసిన కృషికి గానూ ఈ అవార్డు దక్కింది. 2023 మేలో పపువా న్యూ గినియాలో పర్యటన సందర్భంగా దీన్ని మోదీకి ప్రదానం చేశారు.

కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజి:

అంతర్జాతీయ స్థాయిలో నాయకత్వానికి గుర్తింపుగా ఫిజి ఈ పురస్కారాన్ని అందజేసింది. ఈ ఏడాది మేలో అక్కడ పర్యటన సమయంలో ప్రధాని మోదీ దీన్ని అందుకున్నారు.

ఎబాకల్ అవార్డ్:

పపువా న్యూ గినియా పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు సురంగెల్ ఎస్ విప్స్ జూనియర్ సాంస్కృతిక ప్రాముఖ్యం కలిగిన ‘ఏబాకల్ అవార్డు’తో మోదీని సత్కరించారు.

ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గ్యాలో:

భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ఇది. దీనిని 2021లో భూటాన్ అందజేసింది. కరోనా సమయంలో అందించిన సహకారానికి గుర్తుగా ఈ పురస్కారాన్ని ఇచ్చినట్లు ప్రకటించింది.

లీజియన్ ఆఫ్ మెరిట్ :

అమెరికా సాయుధ బలగాలకు చెందిన అవార్డు ఇది. సేవలు, ఎన్నో విజయాలు సాధించిన వ్యక్తికి దీన్ని ప్రకటిస్తారు. 2020 లో మోదీ దీనిని అందుకున్నారు.

కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రనేసాన్స్:

బహ్రెయిన్ పురస్కారం. 2019లో ఈ అత్యున్నత పురస్కారాన్ని గల్ఫ్ దేశం అందించింది.

ఆర్డర్ ఆఫ్ ది డిస్టింగ్విష్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజుద్దీన్:

మాల్దీవులకు చెందిన అత్యున్నత పురస్కారం. దీన్ని 2019లో మాల్దీవుల ప్రభుత్వం అందజేసింది.

ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టర్:

రష్యా అత్యున్నత “పౌర పురస్కారం. 2019లో ఇచ్చారు.

ఆర్డర్ ఆఫ్ జయేద్ :

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అత్యున్నత పౌర పురస్కారం. దీన్ని 2019లో అందుకున్నారు.

గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా:

విదేశీ ప్రముఖులకు పాలస్తీనా ఇచ్చే అత్యున్నత పురస్కారం. 2018లో పాలస్తీనా ఈ అవార్డును అందజేసింది.

స్టేట్ ఆఫ్ ది ఘాజీ అమీర్ అమానుల్లా ఖాన్ :

అఫ్గానిస్థాన్ అత్యున్నత పౌర పురస్కారం. దీనిని 2016లో అందుకున్నారు.

ఆర్డర్ ఆఫ్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్:

సౌదీ అదేబియా అత్యున్నత పురస్కారం ఇది. దీన్ని ముస్లిమేతర ప్రముఖులకు సౌదీ అందజేస్తుంది 2016లో దీనిని ప్రధానం చేశారు.

అంతర్జాతీయ సంస్థల పురష్కారాలు

గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ అవార్డు :

అంతర్జాతీయ ఇంధన, పర్యావరణ రంగంలో ‘గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ అవార్డు’ను ప్రధాని మోదీకి కేంబ్రిడ్జి ఎనర్జీ రీసెర్చ్ అసోసియేషన్ 2021లో అందించింది.

గ్లోబల్ గోల్ కీపర్ అవార్డు:

స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి సంబంధించి ‘గ్లోబల్ గోల్ కీపర్ అవార్డును బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ అందజేసింది.

ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ :

పర్యావరణానికి సంబంధించి ఐరాస అందించే అత్యున్నత పురస్కారం ‘ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ 2018లో వరించింది.

సియోల్ పీస్ ఫ్రైజ్ :

ప్రపంచ శాంతితో పాటు మానవాళి సామరస్యతకు కృషి చేసిన గొప్ప వ్యక్తులకు ‘సియోల్ పీస్ ఫ్రైజ్’ అందజేస్తారు. 2018లో సియోల్ పీస్ ప్రైజ్ కల్చరల్ ఫౌండేషన్ ఈ అవార్డును ప్రకటించింది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు