క్రమబద్ధీకరణ సానుకూల తీర్పు పట్ల హర్షం – కొప్పిశెట్టి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్దీకరణ చేయటానికి జీవో నెంబర్ 16 విడుదల చేయడం జరిగింది. క్రమబద్దీకరణకు వ్యతిరేకంగా నక్కల గోవింద్ రెడ్డి మరియు జే. శంకర్ అనేవారు హైకోర్టులో pill 122/ 2017 కేసు వేయగా హైకోర్టు తాత్కాలికంగా క్రమబద్ధీకరణ ఆపుచేయడం జరిగింది.

ఈ విషయంలో ప్రభుత్వంతోపాటు కాంట్రాక్టు లెక్చరర్ల తరఫున TSGCCLA _ 475, హైకోర్టులో ఇంప్లీడ్ కావడం జరిగింది. ఇది అనేక వాయిదాల తర్వాత ,ఈరోజు హైకోర్టులో వాదనలు రావడం జరిగింది. హైకోర్టు కాంట్రాక్టు ఉద్యోగుల కి/ లెక్చరర్లకు అనుకూలంగా PILL122/ 2017 కొట్టివేస్తూ, ఆ పిటిషన్ వేసిన వారికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు జరిమానా వేయడం జరిగింది. ఈ కేసులో సహకరించిన ప్రభుత్వానికి మరియు జీవీఎల్ మూర్తి లాయర్ల టీంకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి‌, హైకోర్టు తీర్పును అనుసరించి వెంటనే కాంట్రాక్టు ఉద్యోగులను కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరణ చేయడానికి ఈ మార్గదర్శకాలు విడుదల చేయవలసిందిగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు G . రమణారెడ్డి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్v శ్రీనివాస్, రాష్ట్ర కోశాధికారి నాయన శ్రీనివాస్ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ శోభన్ బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కురుమూర్తి, గంగాధర్, దేవేందర్, డాక్టర్ పడాల జగన్నాథం, వైకుంఠం, ప్రవీణ్, శైలజా , రమాదేవి, సంగీత, ఉదయశ్రీ తదితరులు విజ్ఞప్తి చేశారు

Follow Us @