ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ – TSPSC

హైదరాబాద్ (జూలై – 31) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) సాంకేతిక విద్య మరియు ఇంటర్మీడియట్ విద్యలో భర్తీ చేయనున్న ఫిజికల్ డైరెక్టర్ (P.D. JOBS ONLINE APPLICATION EDIT OPTION BY TSPSC) పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు దరఖాస్తులో ఎలాంటి లోపాలు ఉన్న ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.

ఆగస్టు 01 నుండి ఆగస్టు 04వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో ఎడిట్ ఆప్షన్ ని ఉపయోగించుకోవచ్చు. ఒక అభ్యర్థి ఒకసారి మాత్రమే ఎడిట్ ఆప్షన్ ని ఉపయోగించుకోవచ్చు కావున అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న ఫారం ని దగ్గర ఉంచుకొని ఎడిట్ ఆప్షన్ ని ఉపయోగించుకోవాలని కమిషన్ సూచించింది.

◆ వెబ్సైట్ : https://www.tspsc.gov.in/