పాఠశాల విద్యార్థులకు తపాలా శాఖ స్కాలర్ షిప్

హైదరాబాద్ (జూలై – 28) : భారతీయ తపాలా శాఖ 2022-2023 సంవత్సరానికి దీన్ దయాళ్ స్పార్ష్ యోజన స్కాలర్షిప్ ప్రోగ్రాం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా స్టాంపుల సేకరణ హాబీ, పరిశోధనలో ప్రోత్సాహం కోసం తెలంగాణలోని ఆరో తరగతి – తొమ్మిదో తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం స్కాలర్షిప్లు : 920 (ప్రతి పోస్టల్ సర్కిల్ కు 40 స్కాలర్షిప్స్ అందజేస్తారు)

స్కాలర్షిప్ మొత్తం: ఏడాదికి రూ.6000 (నాలుగు త్రైమాసికాల్లో రూ.1500 చొప్పున అందజేస్తారు.

అర్హత: ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులు అర్హులు. వీరికి మంచి అకడమిక్ రికార్డుతో పాటు తపాలా బిళ్లల సేకరణ హాబీ ఉండాలి.

ఎంపిక: ఫిలాటెలీ క్విజ్, ఫిలాటెలీ ప్రాజెక్ట్ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్లైన్ ద్వారా.

దరఖాస్తులకు చివరితేదీ: 2022, ఆగస్టు 26.

చిరునామా: అసిస్టెంట్ డైరెక్టర్ (ఫిలాటెలీ), చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, తెలంగాణ సర్కిల్, డాక్ సదన్, అబిడ్స్, హైదరాబాద్-500001.

వెబ్ సైట్: https://tsposts.in/

Follow Us @