హైదరాబాద్ (డిసెంబర్ – 14) : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ విద్యార్థులకు శుభవార్త చెప్పారు. పీహెచ్డీ చేయాలంటే ఇక నుంచి మాస్టర్ డిగ్రీ (పీజీ) అవసరం లేదని కేవలం 4 ఏళ్ల డిగ్రీ పూర్తిచేసిన వారు కూడా పీహెచ్డీ కి అర్హులేనని యూజీసీ ఛైర్మన్ జగదీష్ కుమార్ కీలక ప్రకటన చేశారు.
మూడేళ్ల డిగ్రీ లేదా నాలుగేళ్ల డిగ్రీలపై యూనివర్సిటీలు నిర్ణయం తీసుకోవచ్చని. నాలుగేళ్ల డిగ్రీ 2023 – 24 నుండి పూర్తి స్థాయిలో అమలులోకి రానుందని తెలిపారు.
4 ఏళ్ల డిగ్రీ కోర్సులు వచ్చినా మూడేళ్ల డిగ్రీ కోర్సులు కూడా ఉంటాయని విద్యార్థులు ఇష్టమైన డిగ్రీ కోర్సును ఎంచుకోవచ్చు అని తెలిపారు.