హైదరాబాద్ (సెప్టెంబర్ – 08) ‘ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం 2022-23 విద్యా సంవత్సరానికి (జులై 2022 సెషన్) వివిధ సబ్జెక్టుల్లో పీహెచ్డీ ప్రోగ్రామ్ ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
◆ సబ్జెక్టులు : అప్లైడ్ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ప్లాంట్ సైన్సెస్, మైక్రోబయాలజీ, యానిమల్ బయాలజీ, బయోటెక్నాలజీ, ఫిలాసఫీ, హిందీ, ఉర్దూ, అప్లైడ్ లింగ్విస్టిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, ఎడ్యుకేషన్, రీజనల్ స్టడీస్, జెండర్ స్టడీస్, ఎకనామిక్స్.
◆ అర్హతలు : 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
◆ ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. జేఆర్ఎఫ్ అర్హత పొందిన అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది.
◆ దరఖాస్తు ఫీజు: జనరల్ రూ.600, ఈడబ్ల్యూఎస్ రూ.550, ఓబీసీ రూ.400, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.275 చెల్లించాలి.
◆ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 15.09.2022.
◆ ప్రవేశ పరీక్షల తేదీలు : అక్టోబర్, 2022.
◆ వెబ్సైట్: http://acad.uohyd.ac.in/
Follow Us @