PhD : అటవీ పరిశోధన కళాశాలలో పీహెచ్డీ ప్రవేశాలు

సిద్దిపేట (జనవరి – 21) : సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాలలో పీహెచ్డీలో ఫారెస్ట్రీ కోర్సుకు FCRITS (అటవీ కళాశాల, పరిశోధన సంస్థ) దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేసింది. సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ కలిగి ఉన్నవారు అర్హులు.

దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 20 నుంచి 29వ తేదీ లోపు గడువు ఉన్నట్లు తెలిపారు. దరఖాస్తు ఫీజు 2,000/- (ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ లకు 1,000/-).

◆ వెబ్సైట్ : www.fcrits.in