పార్మా డీ అభ్యర్థులను క్లినికల్ పార్మాసిస్టులు గుర్తిస్తూ కేంద్రం గెజిట్

ఆరేళ్ల ఫార్మా – డి కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులను క్లినికల్‌ ఫార్మాసిస్టులుగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ మేరకు ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (PCI) నోటిఫికేషన్‌ ఇచ్చింది.

క్లినికల్‌ ఫార్మాసిస్టులు రోగులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని భద్రపరడం, ఔషధాల వాడకం, వాటి వల్ల వచ్చే దుష్ప్రభావాల గురించి రోగులు, వారి బంధువులకు వివరించడం లాంటి పలు బాధ్యతలు నిర్వర్తిస్తారని. అలాగే ప్రతి ఆసుపత్రిలో క్లినికల్‌ ఫార్మాసిస్టును నియమించుకోవాలని అందుకు ఫార్మా డి అభ్యర్థులు అర్హులని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

గత ఏడేళ్ల నుంచి దేశవ్యాప్తంగా ఫార్మా – డి అభ్యర్థులు తమ చదువుకు గుర్తింపు ఇవ్వాలని, తమను వైద్యులతో సమానంగా గుర్తించాలని ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

Follow Us @