గురుకుల డిగ్రీ కళాశాలల్లో పీజీ కోర్సులు

తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో నడుస్తున్న కొన్ని గురుకుల డిగ్రీ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం(2020-21) నుండి తొలిసారిగా పీజీ కోర్సులు ప్రవేశపెడుతున్నారు.

ఈ మేరకు ఇప్పటికే శాఖ అధికారులు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి లేఖ కూడా రాశారు. ఎంపిక చేసిన గురుకుల డిగ్రీ కళాశాలల్లో ఒక్కోచోటా ఒకటి లేదా రెండు పీజీ కోర్సులను ప్రారంభించనున్నారు.

కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్‌, MCom, MA ఇంగ్లీష్ కోర్సులు రానున్నాయి. CPGET – 2021 కౌన్సెలింగ్‌ ప్రారంభమయ్యే నాటికి ఏయో గురుకుల కళాశాలలో పీజీ కోర్సులు ప్రవేశపడతారో స్పష్టత రానుంది..

Follow Us@