ఇక ప‌ద్మ‌శ్రీ గ్ర‌హీత‌ల‌కు పింఛన్ – ఉత్తర్వులు జారీ

BIKKI NEWS (JULY 22) : PENSION TO PADMA AWARDEES IN TELANGANA. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు! పద్మశ్రీ అవార్డులు ప్రకటంచగానే శిల్పరామం లో ఘనంగా సత్కరించిన విషయం విదితమే!

PENSION TO PADMA AWARDEES IN TELANGANA

ఇటీవలే పద్మశ్రీ గ్రహీతలకు ఒక్కొక్కరికి 25 లక్షలు నజరానా అందించగా, ప్రతి నెలా 25 వేల రూపాయలు పింఛనుకు సంబంధించి ఇవాళ జివో విడుదల చేశారు. ఇక నుంచి ప్రతి నెల 25 వేల రూపాయల గౌరవ పెన్షన్ అందుతుందని సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

కనుమరుగవుతున్న కళలను గుర్తించి, వాటిని భవిష్యత్తు తరాలకు అందించే క‌ళాకారుల‌ను ప్రోత్స‌హించేందుకు సీయం రేంవ‌త్ రెడ్డి సార‌ధ్యంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు.

అందులో భాగంగా ఇటీవ‌లే ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాన్ని అందుకున్న గ‌డ్డం స‌మ్మ‌య్య‌, దాస‌రి కొండ‌ప్ప‌ తదితరులకు ప్ర‌తీ నెల 25 వేల రూపాయల ప్ర‌త్యేక‌ పింఛ‌న్ మంజూరు చేస్తూ జీవో జారీ చేసినట్లు వివరించారు. ఇక నుంచి సాంస్కృతిక శాఖ ద్వారా పింఛ‌న్ డ‌బ్బులు నేరుగా వారి ఖాతాల్లో జ‌మ అవుతాయి.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు