హైదరాబాద్ (నవంబర్ – 09) : తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం(2023-24) నుంచి పదో తరగతి హాల్ టికెట్లతోపాటు మార్కుల మెమోలపై PERMANEMT EDUCATION NUMBER – PEN నంబర్ ను ముద్రించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పూర్వ ప్రాథమిక తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రవేశ రిజిస్టర్, హాజరు రిజిస్టర్, రికార్డ్ షీట్/టీసీ తదితర వాటిపై PERMANENT EDUCATION NUMBER రాయడం, ముద్రించడం ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి తప్పనిసరి చేశారు. అందువల్ల ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల యాజమాన్యాలు దీని గురించి తెలుసుకొని ఉండాలని విద్యాశాఖ సూచించింది.
అందుకే ప్రతి విద్యార్థి పేరు జిల్లా పాఠశాల విద్యా సమాచారం (యూడైస్ ప్లస్) పోర్టల్ లో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని, వివరాలను అప్డేట్ చేయాలని పాఠశాల విద్యా శాఖను విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఆదేశించారు. యూడైస్ లో ఉన్న వారికి మాత్రమే సాఫ్ట్వేర్ ద్వారా శాశ్వత సంఖ్య కేటాయిస్తారని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.