PELE : పుట్‌బాల్ దిగ్గజం పీలే అస్తమయం

బ్రెజిల్ (డిసెంబర్ – 30) : పుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు పీలే PELE (82) అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతను.. పరిస్థితి విషమించడంతో కన్నుమూశారని కూతురు ప్రకటించింది.

అతను బ్రెజిల్ మూడుసార్లు (1958, 1962, 1970) ప్రపంచకప్ అందించారు. పీలే బ్రెజిల్ తరఫున 92 అంతర్జాతీయ మ్యాచ్లలో 77 గోల్స్ చేశారు. మొత్తం 1,363 మ్యాచ్ లలో 1,281 గోల్స్ చేశారు. 2000లో ‘ప్లేయర్ ఆఫ్ ది సెంచరీ’గా ఎంపికయ్యారు.