RRvsPBKS : రాజస్తాన్ గెలుపు

ధర్మశాల (మే – 19) : రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్టుపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆప్స్ అవకాశాలు సజీవంగా ఉంచుకుంది. పంజాబ్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.

మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ శ్యామ్ కర్రన్, జితేష్ శర్మ, షారుక్ ఖాన్ రాణీంచడంతో 187 పరుగులు సాధించింది.

అనంతరం బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు జైశ్వాల్ 50, పడిక్కల్ 51, హెట్మేయర్ 46 పరుగులతో రాణించడంతో విజయం సాధించింది.