జగిత్యాల గురుకులాల్లో పార్ట్ టైం టీచింగ్ ఉద్యోగాలు

జగిత్యాల : (ఆగస్టు : 23) జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలు గొల్లపల్లి(బాలురు), జగిత్యాల(బాలికలు), కోరుట్ల (బాలురు) మరియు మెట్పల్లి (బాలికలు)లో 2022-2023 విద్యా సంవత్సరమునకు గాను ఈక్రింది సబ్జెక్టులు పార్ట్ టైమ్ బేసిస్ లో బోధించుటకు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరనైనది.

ఆసక్తి కలిగిన అభ్యర్థులు జిల్లా సమన్వయాధికారి, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/ కళాశాల. మేడిపల్లి ( గ్రామము & మండలము) జగిత్యాల జిల్లా యందు తేదీ : 24.08.2022 న ఉదయం 09.00 గం. నుండి 11.00 గం. లోపు తమ అసలు ధ్రువీకరణ పత్రములతో నమోదు చేసుకుని అదే రోజు జరుగు ఇంటర్వ్యూ మరియు డెమోలకు హాజరు కావలెను. ఇట్టి ఎంపిక తేదీలలో మార్పులు మరియు రద్దు చేయు అధికారం జిల్లా పాలనాధికారి, జగిత్యాల గారికి కలదు.

ఖాళీల వివరాలు :

  • గొల్లపల్లి కళాశాలలో పి.జి.టి- భౌతికశాస్త్రం -1, టి.జి.టి తెలుగు–1, జే.ఎల్ – తెలుగు1, జే .ఎల్ ఆంగ్లము -1, జే.ఎల్- గణితశాస్త్రం -1,
  • జగిత్యాల కళాశాలలో జే.ఎల్. తెలుగు -1, జే.ఎల్ జువాలజీ-1,
  • కోరుట్ల కళాశాలలో జే .ఎల్ – తెలుగు -1, జే.ఎల్ – ఆంగ్లము -1, జే.ఎల్- గణితశాస్త్రం -1 జే .ఎల్ – కామర్స్-1, మరియు
  • మెట్ పల్లి కళాశాలలో జే .ఎల్- ఎకనామిక్స్ -1, జే.ఎల్-సివిక్స్ -1, ఖాళీలు కలవు.

అర్హతలు : అభ్యర్థులు వారి సబ్జెక్టు లో పి జి మరియు బి.ఎడ్. విద్యార్హతలు కలిగి ఉండవలెను.

వేతనం : పార్ట్ టైమ్ టి.జి.టి / పి .జి .టికి రూ 18200/- మరియు పార్ట్ టైం జే.ఎల్ కి రూ.23,400/- నెలవారి పారితోషికం ఇవ్వబడును.

ఎంపిక విధానం : ఖాళీలు అభ్యర్థులు ఇంటర్వ్యూ మరియు డెమో ఆధారంగా భర్తీ చేయబడును.

Follow Us @