ఒకేషనల్ పార్ట్ టైమ్ ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాడుతా : మధుసూదన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసే ఒకేషనల్ పార్ట్ టైం లెక్చరర్లు మరియు అటెండర్ లకు న్యాయం జరిగే వరకూ మీ వెంట ఉండి పోరాడతానని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. సోమవారం హైదరాబాద్ లోని ఇంటర్ విద్యా జేఏసీ కార్యాలయంలో ఒకేషనల్ పార్ట్ టైం జూనియర్ లెక్చరర్లు మరియు అటెండర్లు మధుసూదన్ రెడ్డిని కలిసి వారి సమస్యలు విన్నవించుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని తెలిపారు. 27 సంవత్సరాల నుండి రెగ్యులర్ ఉద్యోగులతో సమాన పనిచేస్తున్నా నేటికీ కనీస వేతనం లేకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగే వరకు మీ వెంట ఉండి పోరాటం చేస్తానని తెలిపారు.

త్వరలోనే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుని కలిసి సమస్యను వివరించి న్యాయం జరిగే విధంగా తాను కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారని పార్ట్ టైమ్ లెక్చరర్ లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఒకేషనల్ పార్ట్ టైం లెక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు బాల ప్రకాష్, కృష్ణకుమారి, జగన్మోహన్, పోతు సుధాకర్, నిస్సార్ అహ్మద్, శ్రీ రాములు, వెంకటేశ్వర్లు, లక్ష్మణ రావు, గౌరీ శంకర్, రఘురాం, భీమయ్య, రాములు మొదలగువారు పాల్గొన్నారు.

Follow Us @