8 మంది పార్ట్ టైం జూనియర్ లెక్చరర్ ల క్రమబద్ధీకరణ

హైదరాబాద్ (జూలై -06) : ఇంటర్మీడియట్ విద్య లో పనిచేస్తున్న పార్ట్ టైం జూనియర్ లెక్చరర్ లను 8 మందిని క్రమబద్ధీకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో 20) జారీ చేసింది.

జీవో నెంబర్ 16 ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ విద్యలో ఒకేషనల్ విభాగంలో పనిచేస్తున్న 8 మంది పార్ట్ టైం జూనియర్ లెక్చరర్ లను క్రమబద్ధీరిస్తూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఉత్తర్వులు కాపీ