BIKKI NEWS : PARIS OLYMPICS 2024 CURRENT AFFAIRS. ALL ABOUT PARIS OLYMPICS. పారిస్ ఒలింపిక్స్ 2024 కు సంబంధించి పోటీ పరీక్షలలో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి సమాచారం సంక్షిప్తంగా సమగ్రంగా మీ కోసం….
PARIS OLYMPICS 2024 CURRENT AFFAIRS
పారిస్ ఒలింపిక్స్ 2024 – వీటినే సమ్మర్ ఒలింపిక్స్ అంటారు.
ఈ ఒలింపిక్స్ 33వ ఎడిషన్ ఆధునిక ఒలింపిక్స్
ఒలింపిక్స్ 2024 షెడ్యూల్ జూలై – 26 నుంచి ఆగస్టు 11 వరకు
మొదటి సమ్మర్ ఒలింపిక్స్ (ఆధునిక ఒలింపిక్స్) 1896 గ్రీస్ లో నిర్వహించారు.
పారిస్ ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వడం ఇది మూడోసారి. గతంలో 1900, 1924 లలో కూడా ఆతిథ్యం ఇచ్చింది.
2028 లో జరిగే 34వ ఒలింపిక్స్ లాస్ ఎంజిల్స్ (అమెరికా) లో జరగనున్నాయి.
2032 లో జరిగే 35వ ఒలింపిక్స్ బ్రిస్బేన్ (ఆస్ట్రేలియా) లో జరగనున్నాయి.
2036 లో జరిగే 36వ.ఒలింపిక్స్ కు భారత్ & ఈజిప్టు దేశాలుఆతిథ్యం కోసం పోటీపడుతున్నాయి.
ఈ ఒలింపిక్స్ లో 32 ప్రధాన క్రీడలు, 48 విభాగాలలో జరగగా మొత్తం 329 మెడల్ ఈవెంట్స్ జరిగాయి.
మొట్టమొదటి సారి ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు ప్రధాన స్టేడియంలో కాకుండా పారిస్ గుండా ప్రవహించే సేన్ నది లో పడవలలో జరిగింది.
206 దేశాల నుండి క్రీడాకారులు ఈ ఒలింపిక్స్ లో పాల్గొన్నారు.
ఈ ఒలింపిక్స్ లో తొలిసారిగా ప్రవేశపెట్టిన క్రీడాంశాలు నాలుగు అవి… బ్రేకింగ్, సర్ఫింగ్, స్కేట్ బోర్డింగ్, స్పోర్ట్స్ క్లైబింగ్
అమెరికా నుండి 640 మంది, ప్రాన్స్ నుండి 606 మంది క్రీడాకారులు ఈ ఒలింపిక్స్ లో పాల్గొన్నారు.
పారిస్ ఒలింపిక్స్ మస్కట్ – ఫ్రెంచ్ ఫిరిజియన్ హ్యట్
పారిస్ ఒలింపిక్స్ మోటో – ‘Alone we go faster bust together we go further’
2034 వింటర్ ఒలింపిక్స్, పారాలింపిక్స్ ఆతిథ్య హక్కులను దక్కించుకున్న నగరం ఏది.?
జ : యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్‌ఏ) లోని ఉటా రాష్ట్రంలో ప్రధాన నగరమైన సాల్ట్ లేక్ సిటీ
2030 వింటర్ ఒలంపిక్స్ కు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది.?
జ : ప్రాన్స్
ఇంటర్నేషనల్ ఒలంపిక్ కమిటీ సభ్యురాలిగా నిలిచిన భారతీయురాలు ఎవరు.?
జ : నీతా అంబానీ
అర్చరీ లో 694 పాయింట్ల తో ప్రపంచ రికార్డు నెలకొల్పిన క్రీడాకారిణి ఎవరు.?
జ : లిమ్ సిహైన్ (దక్షిణ కొరియా)
ఒలింపిక్స్ 2024 మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం నెగ్గిన భారత క్రీడాకారిణి ఎవరు.?
జ : మనూ భాకర్ (221.7)
కెరీర్ లో 10 ఒలింపిక్స్ గేమ్స్ ఆడిన మొదటి క్రీడాకారిణి గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : నినో సలుక్వాడ్జే
పారిస్ ఒలింపిక్స్ లో షూటింగ్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో కాంస్య సాదించిన క్రీడాకారులు ఎవరు.?
జ : మను భాకర్ & సరబ్‌జోత్ సింగ్
ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన ప్లేయర్‌గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : మను భాకర్
ప్రపంచ లో అత్యంత వేగవంతమైన పిన్నవయస్సు కలిగిన పారా స్విమ్మర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : జియా రాయ్ (16 ఇయర్స్)
పారిస్ ఒలింపిక్స్ లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో కాంస్యం నెగ్గిన భారత షూటర్ ఎవరు.?
జ : స్వప్నిల్ కుశాల్
పారిస్ ఒలింపిక్స్ లో మహిళల 100 మీటర్ల పరుగుల పోటీలో విజేతగా ఎవరు నిలిచారు.?
జ : జలియన్ (10.72 సెకండ్స్)
పారిస్ ఒలింపిక్స్ లో 10 వేల మీటర్ల పరుగులో స్వర్ణం ఎవరు గెలుచుకున్నారు.?
జ : జోషువా చెప్తెగాయ్ (ఉగాండా)
పారిస్ ఒలింపిక్స్ లో పురుషుల డబుల్స్ టెన్నిస్ లో స్వర్ణం ఎవరు గెలుచుకున్నారు.?
జ : ఎబ్డెన్ – పీర్స్ జోడి (ఆస్ట్రేలియా)
పారిస్ ఒలింపిక్స్ లో 100 మీటర్ల పురుషుల పరుగులో స్వర్ణ పతకం ఎవరు సాదించారు.?
జ : నోవా లైల్స్ (అమెరికా) (9.79 సెకండ్స్)
ఒలింపిక్స్‌లో పురుషుల సెమీస్‌కు చేరిన తొలి భారత షట్లర్‌గా ఎవరు నిలిచారు.?
జ : లక్ష్యసేన్
ఒలింపిక్స్ లో పురుషుల టెన్నిస్ సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : జొకోవిచ్
పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత పతాకధారిణిగా వ్యవహరించనున్నారు.?
జ : మనూభాకర్
ఒలింపిక్స్ ఫైనల్‌కు చేరిన తొలి భారత మహిళా రెజ్లర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : వినేశ్ పోగట్
వినేశ్ పోగట్ ఎంత ఆధిక బరువు కారణంగా దూరం అయింది.?
జ : 100 గ్రాముల
అధిక బరువు కారణంగా ఏ భారత మహిళా రెజ్లర్ పై పారిస్ ఒలింపిక్స్ లో అనర్హత వేటు పడింది.?
జ : వినేశ్ పోగట్
రెజ్లింగ్ కు వీడ్కోలు పలికిన ప్రఖ్యాత క్రీడాకారిణి ఎవరు.?
జ : వీనెశ్ పోగట్
పారిస్ ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో లో నీరజ్ చోప్రా ఏ పతకం గెలుచుకున్నాడు.?
జ : సిల్వర్ మెడల్ (89.45 మీటర్లు)
విశ్వ క్రీడల్లో భారత పురుషుల హకీ జట్టు ఏ పతకం నెగ్గింది.?
జ : కాంస్యం పతకం
ఎన్ని సంవత్సరాల తర్వాత ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి భారత హకీ జట్టు కాంస్యం గెలుచుకుంది.?
జ : 52 ఏండ్ల తర్వాత
అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం ఏ భారత క్రీడాకారిణిపై మూడేండ్ల నిషేధం విధించింది.?
జ : అంతిమ్ పంగల్
పారిస్ ఒలింపిక్స్ లో మరథాన్ స్విమ్మింగ్ లో స్వర్ణం ఎవరు గెలుచుకున్నారు.?
జ : వాన్ రావెండల్ (నెదర్లాండ్స్)
పారిస్ ఒలింపిక్స్ లో 400 మీటర్ల పరుగు పందెంలో ఎవరు స్వర్ణం గెలుచుకున్నాడు.?
జ : క్విన్సీ హల్ (అమెరికా)
పారిస్ ఒలంపిక్స్ 2024లో ఏ భారత్ రెజ్లర్ కాంస్య పతకం సాధించాడు.?
జ : అమన్ షెహ్రవత్
పురుషుల 89 కిలోల విభాగంలో ఏకంగా 404 కిలోల బరువును ఎత్తి ఒలింపిక్ రికార్డులతో పాటు ప్రపంచ రికార్డుల ను బ్రేక్ చేసిన బల్గేరియా వెయిట్ లిఫ్టర్ ఎవరు.?
జ : కార్లొస్ నాసర్ (21 ఏళ్ళు)
ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత మువ్వన్నెల పతకాన్ని చేతబూనే అవకాశం ఎవరికి దక్కింది.?
జ : మను భాకర్ & పీఆర్ శ్రీజేష్
పారిస్ ఒలింపిక్స్ లో రజతం సాదించిన భారత జావెలిన్ త్రోయర్ ఎవరు.?
జ : నీరజ్ చోప్రా (89.45 మీటర్లు)
జావెలిన్ త్రో లో ఒలింపిక్స్ & ప్రపంచ రికార్డు తో స్వర్ణం నెగ్గిన పాకిస్థాన్ ఆటగాడు ఎవరు.?
జ : అర్షద్ నదీమ్ (92.97 మీటర్లు)
ఒలింపిక్స్ లో పురుషుల మరథాన్ స్విమ్మింగ్ లో స్వర్ణం నెగ్గిన ఆటగాడు ఎవరు.?
జ : క్రిప్టోవ్ రసోవ్‌స్కీ (హంగేరీ)
పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత్ మొత్తం ఎన్ని పతకాలు గెలుచుకుంది.?
జ : 6
పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత్ మొత్తం 6 పతకాలు గెలుచుకుని ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 71వ స్థానంలో
పారిస్ ఒలింపిక్స్ 2024 క్రీడలను ఎన్ని రోజులపాటు నిర్వహించారు.?
జ : 17 రోజులు
పారిస్ ఒలింపిక్స్ 2024 లో మొదటి స్థానంలో నిలిచిన దేశాలు ఏవి.?
జ : యూఎస్ఏ 40 గోల్డ్ మెడల్స్‌తో చైనాతో సంయుక్తంగా టాప్‌లో నిలిచింది.
పారిస్ ఒలింపిక్స్ 2024 లో మూడో స్థానంలో నిలిచిన దేశం ఏది.?
జ : 20 పసిడి పతకాలతో జపాన్ మూడో స్థానంలో ఉంది.
టోక్యో ఒలింపిక్స్ లో 7 పతకాలు సాదించిన భారత్ ఈసారి ఎన్ని పతకాలు సాదించింది.?
జ : ఆరు పతకాలు (1 సిల్వర్, 5 కాంస్యాలు)
2028, 2032 లో జరుగనున్న ఒలింపిక్స్‌కు ఏ నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.?
జ : 2028 – అమెరికాలోని
లాస్ ఏంజిల్స్. 2032 – ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ సిటీ
ఒలింపిక్స్ లో పురుషుల మరథాన్ లో విజేతగా ఎవరు నిలిచారు.?
జ : తమిరాత్ తోలా (ఇథియోపియా)
ఏ భారత క్రీడాకారుడికి ఒలింపిక్ ఆర్డర్ ను ఒలింపిక్ సంఘం అందజేసింది.?
జ : అభినవ్ బింద్రా
ఏ భారత క్రీడాకారుడికి ఒలింపిక్ ఆర్డర్ ను ఒలింపిక్ సంఘం అందజేసింది.?
జ : అభినవ్ బింద్రా
ఒలింపిక్స్ లో మహిళల మరథాన్ లో విజేతగా ఎవరు నిలిచారు.?
జ : సిఫాన్ హసన్ (నెదర్లాండ్స్)
గోల్డెన్ స్లామ్ (నాలుగు గ్రాండ్ స్లామ్స్ మరియు ఒలంపిక్ గోల్డ్) సాధించిన ఐదవ టెన్నిస్ ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : నోవాక్ జకోవిచ్
గోల్డెన్ స్లామ్ (నాలుగు గ్రాండ్ స్లామ్స్ మరియు ఒలంపిక్ గోల్డ్) సాధించిన ఆటగాళ్లు ఎవరు.?
జ : స్టెఫీ గ్రాప్, సెరెనా విలియమ్స్, రఫెల్ నాదల్, అండ్రీ అగస్సీ, జకోవిచ్