- తల్లిదండ్రులు విద్యార్థుల నడవడికను గమనించాలి, వందశాతం ఉత్తిర్ణతే లక్ష్యం
- కళాశాల ప్రిన్సిపాల్ నాముని పావని కుమారి
BIKKI NEWS (DEC. 11) : Parents Teacher meeting gjc dharmakancha. జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలంగాణ ఇంటర్ విద్యా కమిషనర్ ఆదేశాల ప్రకారం తల్లిదండ్రుల అధ్యాపకుల సమావేశం బుధవారం కళాశాల ప్రిన్సిపాల్ నాముని పావని కుమారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
Parents Teacher meeting gjc dharmakancha
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పావని మాట్లాడుతూ కళాశాలలో ఉచిత అడ్మిషన్లు, ఉచిత పాఠ్యపుస్తకాల తో పాటు అన్ని రకాల సౌకర్యాలు మరియు అనుభవజ్ఞులైన అధ్యాపకులున్నారని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అలాగే హాజరు శాతం తక్కువగా ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటినుండి అయినా క్రమం తప్పకుండా కళాశాలకు పంపించాలని తెలియజేశారు.
కళాశాలలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు సబ్జెక్టు లెక్చరర్ల సమక్షంలో స్టడీ అవర్ ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థుల ఏకాగ్రత పెరగడం కొరకు ధ్యానం చేయించడం, విద్యార్థుల మానసిక వికాసానికి మానవతా విలువలపై అవగాహన కార్యక్రమాలు, క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ప్రిన్సిపాల్ తెలిపారు.
విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోను కాకుండా ఇంటర్ బోర్డ్ టెలి మానస్ ప్రోగ్రాం ద్వారా 14416 అనే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సమస్య పరిష్కారం చేసుకోవచ్చని, అదేవిధంగా విద్యార్థులు మాదకాద్రవ్యాలకు అలవాటు కావడానికి అవకాశాలున్నాయని తల్లిదండ్రులు కూడా గమనిస్తూ ఉండాలని తెలియజేశారు.
రాబోయే ఇంటర్ పబ్లిక్ పరీక్షలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలంటే అధ్యాపకులతో పాటు తల్లిదండ్రుల సహకారం ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకుల బృందం, అధ్యాపకేతర బృందం మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
- WHO IS WHO : రాష్ట్రాలు – ముఖ్యమంత్రులు
- GOVERNORS LIST – రాష్ట్రాల గవర్నర్ లు
- INTER – పరీక్ష లేకుండా గురుకుల ఇంటర్, డిగ్రీ అడ్మిషన్స్
- ICC CHAMPIONS TROPHY 2025 SCHEDULE
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 25 – 12 – 2024