Home > UNCATEGORY > జీజేసీ సంగెంలో పేరెంట్ టీచర్ మీటింగ్

జీజేసీ సంగెంలో పేరెంట్ టీచర్ మీటింగ్

BIKKI NEWS (DEC. 07) : Parent Teacher Meeting in GJC Sangem. ప్రభుత్వ జూనియర్ కళాశాల సంగెంలో విద్యార్థుల అభ్యసనం, వారి పురోగతి గురించి తల్లిదండ్రులు, అధ్యాపకుల సమావేశం నిర్వహించారు. ప్రిన్సిపాల్ కే. మాధవరావు నేతృత్వంలో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు.

Parent Teacher Meeting in GJC Sangem

విద్యార్థుల ప్రగతి, అభ్యసన సమస్యలు, కళాశాల కార్యక్రమాలు అధ్యాపకులతో పేరెంట్స్ సంప్రదింపులు, సందేహాల గురించి చర్చించినారు.

ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ కే.మాధవరావు మాట్లాడుతూ విద్యార్థులు అధ్యాపకులు చెప్పే ప్రతి విషయాన్ని శ్రద్ధగా వినాలని, మీకు ఏవైనా సందేహాలు ఉంటే, వెనుకాడకుండా అడగాలని, అభ్యసనంలో మెరుగుపడటానికి ప్రయత్నించాలని తెలిపారు.

సీనియర్ అద్యాపకురాలు శ్రీమతి బి.విజయనిర్మల మాట్లాడుతూ… ఈ సమావేశంలో తల్లిదండ్రులు పిల్లల పట్ల తీసుకోవలసినటువంటి జాగ్రత్తల గురించి వారు ఏ విధమైన క్రమశిక్షణ కలిగి ఉండాలో భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ఉన్నత స్థితికి చేరుకోవాలో వివరించడం జరిగింది.

అధ్యాపకులు మాట్లాడుతూ.. విద్యార్థులకు సంబంధించిన పాఠ్యాంశాలను సకాలంలో బోధిస్తూ విద్యార్థుల యొక్క క్రమశిక్షణ మరియు వారి యొక్క అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కాక మాధవరావు, విజయనిర్మల, గ్రంధపాలకులు రాజకుమార్, అధ్యాపకులు బుచ్చిరెడ్డి, నాగరాజు, అనిల్ కుమార్, పవన్ కుమార్, కుమారస్వామి, రాఖీ, చిరంజీవి, మాధవి, సుధీర్ కుమార్, అక్రమ్ అలీ, పద్మ, రమాదేవి, సదయ్య, శివ, లక్ష్మి, సంగీత, కార్తీక్, మరియు విద్యార్తినివిద్యార్థులు పాల్గొన్నారు.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు