వేతనాలు మూడు రెట్లు పెంపు

పంజాబ్ (జూన్ – 28) : పంజాబ్ రాష్ట్రంలో ఇటీవల రెగ్యులరైజ్ అయిన 12,700 మంది ఉపాధ్యాయుల వేతనాలను మూడు రెట్లు పెంచినట్లు ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు.

అలాగే సదరు ఉపాధ్యాయులకు ఏడాదికి వారి వేతనాలపై 5% ఇంక్రిమెంట్ కూడా వస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు నెలకు 9,500 పొందుతున్న BA పాస్ ఎడ్యుకేషన్ ప్రొవైడర్లు ఇప్పుడు 20,500 పారితోషికంగా పొందుతారని సీఎం భగవంత్ మాన్ తెలిపారు.