బదిలీలు ఆగవు అని తెలిసి సిగపట్లు ఎందుకు.?

బదిలీలు… కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులు గత మూడు సంవత్సరాలుగా తీవ్రంగా పోరాడుతున్న అంశం, అనేక మంది కుటుంబాలకు సుదూరంగా సంఘర్షణ పడుతున్న అంశం… ఆర్ధిక భారం లేని ఈ అంశం కోసమే నాలుగు సంవత్సరాలుగా పోరాడితే భద్రత కోసం మరి ఇంకెన్నేళ్ళు…

బదులీలు అంశం ఒక కొలిక్కి రావడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది కారణం ఏకాభిప్రాయం లేని సంఘాలు, తాము పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే నైజం.

మెజారిటీ మెంబర్లకు బదిలీలు అవసరమని అన్ని సంఘాలకు తెలుసు అయినా బదిలీల మీద ఎవరి దారీ వారిదే… రెండు నెలల వ్యవధిలో బదిలీల కోసం పాదయాత్ర మరియు మహా క్షీరాభిషేకం వంటి కార్యక్రమాలు చేసి బదిలీల ఆవశ్యకతను ప్రభుత్వానికి చాటి చెప్పారు.

★ బదిలీలు ఆగవు అని తెలిసి సిగపట్లు ఎందుకు.?

బదిలీల పై సీఎం ప్రకటన చేసిన తర్వాత బదిలీలు ఆగవు అని తెలిసి కూడా ఆగం పట్టిస్తున్న పిడికెడు మందిని చూసి సంఘాలు తమ వైఖరిని వెల్లడించలేకపోవడం వారి బేలతనాన్ని సూచిస్తుంది.

ఒకవైపు నూతన విద్యా విధానం జూనియర్ కళాశాలలను కభళించబోతున్న సూచనలు, మరోకవైపు నిరుద్యోగులలో నెలకొని ఉన్న ప్రభుత్వ వ్యతిరేతను తగ్గించే చర్యలలో బాగంగా ఉద్యోగ నోటిఫికేషన్ లలో ప్రభుత్వం ఆదేశిస్తే కాంట్రాక్టు/అతిథి అధ్యాపకులు పని చేస్తున్న పోస్టులను కూడా ఖాళీలుగా చూపించి భర్తీకి సిద్దమని బోర్డు ప్రకటనలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్న వేళ బదిలీల సమస్యను త్వరగా పరిష్కరించి భద్రత కై నడుం బిగించాల్సిన వేళ ఏలా ఈ సిగపట్లు.

సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు వందకి వంద శాతం బదిలీలు జరుగుతాయి అని తెలిసినా… బదిలీల పై ఇంకా సిగపట్లు పట్టడం అవసరమా.? లేక అందరూ కలిసి బదిలీ మార్గదర్శకాల అంశం ప్రభుత్వానికి అప్పజెప్పి తొందరగా బదిలీలు జరిపించి భద్రత కోసం కలిసిమెలిసి లేదా ఎవరీ ప్రయత్నం వారు చేయడమా అనేది సంఘాల పెద్దలు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది.

★ కాంట్రాక్టు లెక్చరర్ల భవిష్యత్తుకు సంఘాల పాత్ర.

ఏ వ్యవస్థలో నైనా తమ హక్కుల సాధనకు సంఘాల పాత్ర ముఖ్యమైనది. సంఘాలు లేనిది సంఘ సభ్యుడు తమ హక్కులను కోల్పోతాడు. 2000 సంవత్సరం నుండి కాంట్రాక్టు లెక్చరర్లు కొన్ని సదుపాయాలు మరియు బేసిక్ పే, పన్నెండు నెలల వేతనం పొందుటకు సంఘాల పాత్ర విలువ కట్టలేనిది. ప్రస్తుత ఈ క్లిష్ట సమయంలో అనగా జాతీయ నూతన విద్యా విధానం మరియు ఖాళీల భర్తీ విషయంలో మన భవిష్యత్తు ఊహించడానికి భయంగా ఉంది. రానున్న ఈ క్లిష్ట సమయంలో సంఘాలకు అతీతంగా కలిసికట్టుగా ఉంటేనే సాధించగలం. సంఘాలన్నీ ఒక్కటై పోరాడాల్సిన సమయం ఆసన్నమైనది. ముందున్న ఈ ప్రమాదాలు అనగా జాతీయ నూతన విద్యా విధానం మరియు ఖాళీల భర్తీ ఎదుర్కోవాలన్న ఏకం కావాల్సిన పరిస్థితి. భవిష్యత్తులో కాంట్రాక్టు లెక్చరర్ల వ్యవస్థ ఉండాలంటే సంఘాల కతీతంగా JAC ఏర్పడి హక్కుల సాధనకై పోరాడాలి. ఐక్యమత్యమే మహాబలం.

★ భవిష్యత్తు ప్రశ్నార్ధకం

రానున్న రోజులలో కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ పరిస్థితులలో కలిమి గా లేకపోతే కాలగర్భంలో కలవాల్సిందే. అన్ని సంఘాలు కలిసి సమిష్టిగా, సామరస్యంగా, సానుకూలంగా స్పందించవలసిన సమయం వచ్చింది. సభ్యుల సంక్షేమం కోరని సంఘాలు సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. నూతన నియామకాలలో అనగా నూతన ఖాళీలలో మరియు ఈ జాతీయ నూతన విద్యా విధానంలో మన కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉంటారా లేక ఇంటికి పంపుతారా అనేది సంఘాల సమిష్టి నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది. చిన్న సమస్య అయినా అటువంటి బదిలీల విషయంలోనే అనేక సమస్యలు మరియు ఆటుపోట్లు ఎదుర్కోవలసి వస్తుంది సమిష్టిగా పోరాడలేక పోతున్నారు. రానున్న రోజులలో సునామీ లాంటి ప్రమాదం పొంచి ఉన్నది. సునామీ వచ్చే ముందు ప్రజలకు తెలియక ఎంతో ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగింది కానీ మనకు వచ్చే ఈ భయంకరమైన సునామీ లాంటి ప్రమాదాలు ముందే హెచ్చరిస్తున్నాయి. కాబట్టి కాంట్రాక్టు లెక్చరర్ మిత్రులారా అందరూ ఆలోచించండి ముందున్న ప్రమాదాన్ని గ్రహించండి జాగ్రత్తగా ఉండవలసిన సమయం, సమిష్టిగా ఉండవలసిన సమయం ఐక్యమత్యంగా ఉండవలసిన సమయం సమీపించింది. సంఘాలన్నీ ఎవరికి వారే యమునా తీరే గా ఉంటే సంఘంలోని సభ్యులు సముద్రంలో మునిగి పోవాల్సిందే.

బదిలీల పై సీఎం ప్రకటన చేసిన తర్వాత బదిలీలు ఆగవు అని తెలిసి కూడా ఆగం పట్టిస్తున్న పిడికెడు మందిని చూసి సంఘాలు తమ వైఖరిని వెల్లడించలేక పోవడం వారి బేలతనాన్ని సూచిస్తుంది

PALOJI MAHESH.

వ్యాసకర్త ::

PALOJI MAHESH,

LECTURER IN ENGLISH, JAGTIAL DISTRICT.

MOBILE :: +91 99894 52787

Follow Us@