ఎమ్మెల్సీ పల్లాకు శుభాకాంక్షలు – 711 రాష్ట్ర నాయకులు జిల్లా నరసింహ

నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలలో పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సందర్భంగా నిన్న నల్లగొండలో జరిగిన విజయోత్సవ ర్యాలీ సందర్భంగా 711 సంఘం రాష్ట్ర నాయకులు జిల్లా నరసింహ ఆధ్వర్యంలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి క్లాక్ టవర్ సెంటర్ లో అమరవీరుల స్థూపం దగ్గర సన్మానం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా నరసింహ మాట్లాడుతూ హరీష్ రావు ఆదేశాల మేరకు 711 రాష్ట్ర సంఘం అధ్యక్షుడు కనక చంద్రం నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు అధ్యాపకులు అందరూ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని బలపరిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించుకోవడం వలన కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకులకు 100% మేలు జరుగుతుందని త్వరలోనే ప్రధాన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని తెలియజేశారు.

శాసన మండలిలో కాంట్రాక్టు అధ్యాపకుల గొంతుకై సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందుంటారనే ఆశాభావం జిల్లా నరసింహ వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మారం హేమ చందర్ రెడ్డి, యదాద్రి జిల్లా అధ్యక్షుడు మెరుగు లింగయ్య, రాష్ట్ర నాయకులు ఈశ్వర్, మందడి వెంకట్ రెడ్డి, యదాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి చిప్పలపల్లి అంజయ్య గారు మరియు జిల్లా నాయకులు ఖాదర్ , జల్లెల శ్రీనివాస్, వనపర్తి శ్రీనివాస్, పందిరి శ్రీనివాస్, అంతయ్య, కిషోర్, పరశురాములు‌, పాల్గొన్నారు.

Follow Us@