బదిలీలు, ఉద్యోగ భధ్రత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా – పల్లా రాజేశ్వర్ రెడ్డి

తెలంగాణ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పని చేస్తున్న కాంట్రాక్టు డిగ్రీ అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనంలో ఈ రోజు హైదరాబాద్ లో జరిగింది. దీనికి తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కనకచంద్రం మరియు హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు మాలతీ హజరయ్యారు.

ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల బదిలీలు మరియు ఉద్యోగ భద్రత సమస్యలను ఎమ్మెల్సీ శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి విన్నవించడం జరిగింది.

అతి త్వరలోనే బదిలీలకు సంబంధించిన గైడ్లైన్స్ ఇచ్చేలా కృషి చేస్తానని, ఖచ్చితంగా ఉద్యోగ భద్రత విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని, అలాగే సీజేఎల్స్ ఎదుర్కొంటున్న ఏ సమస్య ఉన్న పరిష్కారం కొరకు ఎల్లవేళలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు చేర్యాల రవి, హైదరాబాద్ జిల్లా లేడీ సెక్రటరీ జుబేర ఫాతిమా మేడం, తదితరులు పాల్గొన్నారు

Follow Us@