కాంట్రాక్టు లెక్చరర్ ల ఆరాధ్య దైవం కేసీఆర్ చిత్రపటానికి యదాద్రి 711 సంఘం పాలాభిషేకం

తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా మరియు వారితో పాటే పీఆర్సీని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ శాసనసభలో చేసిన ప్రకటన పట్ల యాదాద్రి జిల్లా కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుల సంఘం తరపున కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ వివిధ కళాశాలల్లో కేసీఆర్ చిత్రపటానికి ఈరోజు పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు జిల్లా నరసింహ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో నుండి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో స్పష్టమైన వైఖరితో ఉన్నారని, జీవో నెంబర్ 16న విడుదల చేసి తన గొప్ప మనసును చాటుకున్నారని తెలియజేశారు. కానీ జీవో 16 కోర్టు పరిధిలో కి వెళ్ళడంతో… వెంటనే కేసీఆర్ కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులకు బేసిక్ పే మరియు 12 నెలల పూర్తి వేతనం ఇస్తున్నారని ప్రస్తుతం దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగుల తో సమానంగా పీఆర్సీ ఇవ్వడం ఆయన మానవత్వాన్ని కి నిదర్శనమని పేర్కొన్నారు. కాంట్రాక్టు అధ్యాపకుల మార్గదర్శకులు హరీష్ రావు నేతృత్వంలో కనకచంద్రం నాయకత్వంలో కాంట్రాక్టు అధ్యాపకుల అన్ని సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మెరుగు లింగయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి చిప్పలపల్లి అంజయ్య. రాష్ట్ర నాయకులు మందడి వెంకటరెడ్డి, మాధవి, జిల్లా నాయకులు అంతయ్య, శ్రీశైలం, కిషోర్, నగేష్, సూర్యనారాయణ, గట్టు మల్లయ్య, శ్యామ్, శేఖర్, మంజుల, సుజాత, శ్వేత, భాగ్యలక్ష్మి, కవిత, కృష్ణయ్య ,నర్సిరెడ్డి, లింగస్వామి, మల్లికార్జున్, సాయివర్దన్, విజయ్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us@