సీఎం కేసీఆర్ చిత్ర పటానికి 711 సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం

కాంట్రాక్ట్ అధ్యాపకులకు కూడా నూతన పిఆర్సీ వర్తింప చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలుపుచూ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మారం హేమచందర్ రెడ్డి ఆద్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన తెలంగాణ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్-711 సంఘం సభ్యులు.

మారం హేమచందర్ రెడ్డి మాట్లాడుతూ తాజాగా జరిగిన శాసన మండలి ఎన్నిక్షల్లో రాష్ట్ర అధ్యక్షుడు కనక చంద్రం, ప్రధాన కార్యదర్శి శేఖర్ ల నేతృత్వంలో ఇద్దరు ఎమ్మెల్సీకు సంపూర్ణ మద్దతు తెలిపి‌, గెలిపించి సీఎం కేసీఆర్ గిఫ్ట్ గా ఇచ్చినట్లు ఈ సందర్భంగా తెలిపారు.

మా జీవితాలకు భరోసా, భద్రత కల్పిస్తారని వేయి కన్నులతో ఎదురు చూస్తూన్న మాకు పీఆర్సీ వర్తింపజేసిన సీఎంకి మా కుటుంబాలు ఋణపడి ఉంటాయని తెలిపారు.

జీవో నంబర్ 16 పై కోర్ట్ తీర్పు వచ్చే వరకు కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులకు కనీసం ఈ బెనిఫిట్స్ ఇవ్వాలని సీఎం కు ఈ సందర్భంగా మనవి చేశారు మనవి

  • ఉద్యోగ భద్రత కల్పించాలి.
    సర్వీస్ క్రమబద్దీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి
  • డి.ఏ ,HRA లను కల్పించాలి
  • సీఎం హమీ మేరకు బదిలీలు తక్షణమే చేయాలి
  • కరోనా వచ్చిన కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ సెలవు పెట్టె అవకాశం లేకపోవడం విచారకరం కావున ప్రభుత్వ అధ్యాపకులతో సమానంగా సెలవులు మంజూరు చేయాలి.

ఈ కార్యక్రమంలోజిల్లా అద్యక్షుడు మారం హేమచందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వనపర్తి శ్రీనివాస్,రాష్ట్ర నాయకులు జిల్లా నర్సింహ ,హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి T. మాలతి, స్టేట్ కౌన్సిలర్ ఈశ్వర్, జిల్లా నాయకులు మహేష్ వీరన్న నాగుల్ మీరా, రమణా రెడ్డి ,రమేష్ శర్మ ,నర్సింహ రాజు , శ్రీమతి ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Follow Us@