న్యూడిల్లీ (జనవరి – 25) : భారతదేశ అత్యున్నత పౌర పుష్కారాలు రెండవ, మూడవ, నాల్గవ బహుమతులైన పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను 2023 కేంద్ర ప్రభుత్వం (padma awards 2023 list in telugu ) ఈరోజు ప్రకటించింది. వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు ఈ పౌర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రతి యేట అందజేస్తుంది.
2023 సంవత్సరానికి గాను మొత్తం 106 మందికి పద్మ అవార్డులను ప్రకటించారు. అందులో ఆరుగురికి పద్మ విభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 91 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు.
12మంది తెలుగువారికి పద్మ అవార్డులు దక్కాయి. అందులో 2 పద్మభూషణ్, 10 పద్మశ్రీ అవార్డులు తెలుగు వారికి దక్కాయి.
★ పద్మ విభూషణ్ : బాలకృష్ణ దోసి, దిలీప్ మహాలనబీస్, ములాయం సింగ్ యాదవులకు మరణానంతరం పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించారు. జాకీర్ హుస్సేన్, ఎస్ఎం కృష్ణ, శ్రీనివాస వర్ధన్ లకు కూడా పద్మ విభూషణ్ అందజేశారు.
పద్మభూషణ్ అందుకున్న వారిలో చిన్న జీయర్ స్వామి, కమలేష్ డి పాటిల్ తెలంగాణ నుండి ఉన్నారు.
పద్మశ్రీ కి ఎంపికైన తెలంగాణకు చెందిన వారిలో మోదడుగు విజయ గుప్తా, పూసలపాటి హనుమంతరావు, బి రామకృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారిలో ఎంఎం కీరవాణి, గణేష్ నాగప్ప కృష్ణార్జునగర, అబ్బా రెడ్డి నాగేశ్వరరావు, కోట సచ్చిదానంద శాస్త్రి, సంకురాత్రి చంద్రశేఖర్, సీవీ రాజు, ప్రకాష్ చంద్రసూద్ ఉన్నారు.